రేషన్ కార్డు ఉంటే బియ్యం.. గోధుమలు హైదరాబాద్, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Ration Cards తెలంగాణ ప్రభుత్వం హామీల అమలులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల ద్వారా పేదలక ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం పక్కదారి పడుతున్నాయి. పేదలు వాటిని తినకుండా అమ్మేస్తున్నారు. దీంతో అవి చివరకు రైస్ మిల్లులు లేదా మహారాష్ట్రకు తరలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల రీసైక్లింగ్ దందాకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. జనవరి నుంచి దీనిని అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తాజాగా రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు సన్న బియ్యం పంపిణీపై స్పష్టత ఇచ్చారు.…
Read More