రియల్ మార్కెట్ కు హైడ్రా భరోసా హైదరాబాద్, నవంబర్ 21, (న్యూస్ పల్స్) Hydra హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌నకు కారణంగా హైడ్రా విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా భయంతో ఇళ్లు కొనాలనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి హైడ్రా చట్టవిరుద్దమన ఒక్క బిల్డింగ్ ను కూడా కూల్చలేదు.ఇంకా చెప్పాలంటే ప్లాన్లు వంటి వాటి జోలికి కూడా వెళ్లలేదు. చెరువు స్థలాల్లో,.. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అనుమతులు లేని భవనాలనే కూల్చారు. బడా బాబుల ఫామ్ హౌస్‌లను కూల్చివేసిన తర్వాత మాకూ ఓ హైడ్రా కావాలని జిల్లాల నుంచి పొరుగురాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత హైడ్రాపై జరిగిన ప్రచారం వేరు. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు వేచి చూడాలనే భావనకు వచ్చారు.…
Read More