రాజధాని ఆర్కిటెక్ట్ ల ఖరారుకు బిడ్లు విజయవాడ, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Amaravati Capital ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు స్పీడందుకున్నాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ దాదాపు పూర్తైంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, అధికారుల కార్యాలయాల ఆకృతులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.2014లో అధికారం చేపట్టిన టీడీపీ…అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అనంతరం రాజధానిలో ప్రభుత్వ, అధికారుల భవనాలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతిలో ఐకానిక్ భవనాలకు డిజైన్లను 2018లో లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించింది. అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, అధికారుల కార్యాలయ భవనాల డిజైన్లు మార్చకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లనే కొనసాగించేలా…
Read More