సిద్దిపేట జూన్ 13 అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణం పోసేది రక్తదానం. దీనిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం సాధ్యపడదు. రక్తదానం ఒక పవిత్ర కార్యo. పోయిన ప్రాణాలను మనము ఎలాగో తీసుకురాలేము. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను ఒక్కోసారి సాటి మనిషి రక్తముతో కాపాడగల ము. ఇది రక్త దానము తోనే సాధ్యం. పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటూ బంధుమిత్రులకు విందు ఇవ్వడం కంటే ఇలాంటి రోజులలో రక్తదానం చేయడం గొప్ప సంతృప్తినిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు రక్తదానంపై ప్రజలలో ఇంకా సరైన అవగాహన లేదు. ఎన్నో అపోహలు వెంటాడుతున్నాయి. రక్తదానం విషయంలో స్త్రీ పురుషుల అన్న తేడా లేదు. ఇద్దరూ రక్తదానానికి అర్హులే. అయితే కారణాలు ఏమైతేనేం రక్తదానం విషయంలో ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్త్రీలు కొంతవరకు ముందుకు రావటం లేదు. ఈ పరిస్థితి…
Read More