కాకినాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) చంద్రబాబు నాయుడు ఈసారి కేబినెట్ లో సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారు. సీనియర్ నేతలు ఎవరినీ ఈసారి పరిగణనలోకి తీసుకోలేదు. యనమల రామకృష్ణుడు నుంచి మొదలు పెడితే… అమర్‌నాధ్ రెడ్డి వరకూ ఎవరికీ తన మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీలోకి యువరక్తం ఎక్కించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్ లో ఎలాంటి రాజకీయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు సామాజికవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడుతుంది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు లేని చంద్రబాబు కేబినెట్ ఇదే మొదటిది అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా యనమల రామకృష్ణుడు ఖచ్చితంగా మంత్రిగా ఉంటారు. ప్రాధాన్యత కలిగిన…
Read More