మెడికల్ కాలేజీలకు అనుమతి నిరాకరణ హైదరాబాద్, జూలై 11 (న్యూస్ పల్స్) Denial of permission to medical colleges రేవంత్ రెడ్డి సర్కారుకు నేషనల్ మెడికల్ కమిషన్ షాకిచ్చింది. రాష్ట్రంలో ఎనిమిది కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానున గద్వాల, మెదక్, ములుగు, షాద్నగర్, నారాయణపేట, యాదాద్రి, కుత్బుల్లాపూర్, నర్సంపేటలలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ దరఖాస్తు చేసుకుంది. ఒక్కో కాలేజీలో 50 సీట్లు కేటాయించాలని కోరింది. అయితే, అవసరమైన నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారంటూ అనుమతిచ్చేందుకు ఎన్ఎంసీ నిరాకరించింది. నిబంధనల ప్రకారం.. కొత్తగా 50 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటు కావాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అంటే మొత్తంగా…
Read More