మహారాష్ట్రలో గులాబీ గుడ్ బై… ముంబై, నవంబర్ 2, (న్యూస్ పల్స్) KCR రాజకీయాల్లో ఎవరైనా, ఎన్నైనా కలలు కనొచ్చు. కానీ అవన్నీ నిజమవుతాయా? అంటే కానే కాదన్నది కేసీఆర్ చేసిన ఓ విఫల ప్రయోగం చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. 2014లో తెలంగాణ వచ్చింది. రెండుసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేసింది. అయితే రెండోసారి గెలవగానే కేసీఆర్ చాలా ఊహించుకున్నారు. దేశ రాజకీయాలను మార్చేస్తాననుకున్నారు. ఎన్డీఏ, ఇండియా కూటములు కాదు.. ఫెడరల్ ఫ్రంట్ రావాలన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్నారు. మహారాష్ట్ర, ఏపీలో పోటీకి సై అన్నారు. మధ్యప్రదేశ్, ఒడిశాలోనూ పార్టీ విస్తరించాలనుకున్నారు. నేతల్ని చేర్చుకున్నారు. ఒక్కటేమిటి ఎన్నెన్నో ఊహించుకున్నారు. ఎంతో అనుకున్నారు. ఇవన్నీ జరగాలంటే పార్టీ పేరు…
Read More