మల్లారెడ్డికి టీటీడీపీ బాధ్యతలు..? | TTDP responsibilities for Mallareddy..? | Eeroju news

హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు ఆరుగురు నేతలు ఇప్పటికే అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు అందులోని సారాంశం. అదే జరిగితే కారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు పాలించింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. అందులోని నేతలంతా దాదాపు టీడీపీ నుంచి వెళ్లినవారే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి గెలిచినవాళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More