హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలో 400కుపైగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా.. ఆరు గ్యారంటీలు అమలు కాలేదు. మరోవైపు మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగియడంతో సీఎం రేవంత్‌రెడ్డి హామీల అమలుపై దృష్టిపెట్టారు.ప్రస్తుతం రేవంత్‌రెడ్డి రుణమాఫీకి సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులు సమీకరణపై దృష్టిపెట్టారు. రుణమాఫీ అర్హులను గుర్తించేందుకు కండీషన్లు పెట్టారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ రేవంత్‌కు సవాల్‌గా మారింది.శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆయా శాఖల నుంచి రావాల్సిన బకాయిలు సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెంపుపైనా దృష్టి పెట్టారు. భూముల…
Read More