భారీగా పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు ఆందోళనలో జేఎన్టీయూ హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) Massively raised engineering seats తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఐటీ తదితర సీట్ల సంఖ్య భారీగా పెరగడంపై జేఎన్‌టీయూ హైదారబాద్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత విభాగాల్లో సీట్లను విపరీతంగా పెంచడం మంచిది కాదని తెలిపింది. ఇది భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఏఐసీటీఈకి జేఎన్‌టీయూహెచ్ లేఖ రాసింది. సీట్లు పెంచితే అధ్యాపకుల కొరత తలెత్తుతుందని లేఖలో పేర్కొంది. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచన మేరకు జేఎన్‌టీయూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఈ లేఖ రాశారు.రాష్ట్రంలో కొత్త కళాశాలలు, సీట్ల పెంపుకు సంబంధించిన అనుమతుల విధివిధానాలపై…
Read More