బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…. తిరుమల, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Tirumala తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమంలో క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు ఎలాంటి ఆంటకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా..శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలికలలో పుట్టమన్ను వేసి.. అందులో నవధాన్యాలు నాటుతారు. ఆ నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. బ్రహ్మోత్సావాల్లో భాగంగా రోజూ…
Read More