బొగ్గు చుట్టూ తిరుగుతున్న రాజకీయం హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్) Politics revolving around coal : తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు బొగ్గు చుట్టూ తిరుగుతోంది. తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించకుండా కేంద్రం వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొన్నది. అందుకే బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమ హయాంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని సింగరేణిని కూడా వేలంలో పాల్గొనడానికి అంగీకరించలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ భిన్నంగా స్పందిస్తోంది. వేలంలో పాల్గొనకుండా సింగరేణికి నష్టం చేశారని కోల్ బ్లాకులు బీఆర్ఎస్ నేతల సన్నిహితులుక చెందడానికే ఇలా చేశారంటున్నారు. సింగరేణికి ప్రస్తుతం ఉన్న బొగ్గు గనులు మరో…
Read More