పీఏసీ పదవి దూరమేనా విజయవాడ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) AP News ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పీఏసీ చైర్మన్ ఎంపిక సైతం వైసీపీకి కలిసివచ్చినట్లు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం చతికిల పడాల్సి వచ్చింది. దీంతో కేవలం 11 అంటే 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కావలసి వచ్చింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో శాసనసభలో కనీసం ప్రతిపక్ష హోదా లేదన్న విమర్శలను మూటకట్టుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.అయితే ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే కనీసమైన సభ్యుల సంఖ్య ఉండాలన్న నిబంధనలు చెబుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును సైతం ఆశ్రయించింది. అయితే అనూహ్యంగా సభలో కీలకమైన…
Read More