బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? కరీంనగర్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) BRS అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలతో పనేం ఉన్నాదన్నట్లు ప్రధానమైన నేతలు అంతా సైలెంట్ అయిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు తప్పించి మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెదికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదట.. అధినేత కేసీఆర్‌తో సహా బీఆర్‌ఎస్ నేతలు బయటకి ఎందుకు రావడం లేదు.తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ పనిలేకుండా పోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బీఆర్‌ఎస్ నేతలు ఆ పనిచేయడం లేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారం గల్లంతై 9 నెలలు అవుతున్నా… నూటికి 90 శాతం మంది బీఆర్‌ఎస్ నేతలు ప్రజల్లో కనిపించడం లేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనల్లో హడావుడి…
Read More