బిజెపి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు తిరుపతి, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్) వచ్చేఎన్నికల నాటికి బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏపీలో నడుస్తోంది. ఉమ్మడిగా ఉంటూనే ఎవరికి వారు పార్టీలను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలంగా ఉంది. జనసేన సైతం చేరికలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు బిజెపి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పొత్తులో భాగంగా ఈసారి ఎక్కువ నియోజకవర్గాలను ఆశిస్తోంది. అందుకే సమర్థవంతమైన నేతలను ప్రోత్సహించాలని భావిస్తోంది. వైసీపీ నుంచి చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రాయలసీమ,కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది.బలమైన బీసీ నినాదాన్ని పంపించాలని చూస్తోంది బిజెపి. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ పదవిని వదులుకున్నారు ఆర్ కృష్ణయ్య.…
Read More