విశాఖపట్టణం, జూన్ 14, (న్యూస్ పల్స్) విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను..2021లో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించడంతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు, వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పటినుంచి అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారింది విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశం. అయితే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా ముందడుగే వేసింది కేంద్రం ప్రభుత్వం.అయిదేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సొంత గనులు లేకపోవడంతో…
Read More