ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం సాద్యం కాదు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే న్యూ డిల్లీ సెప్టెంబర్ 19 Congress chief Mallikarjun Kharge జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం చేశారు. మన ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఖర్గే పేర్కొన్నారు. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియకు ఇవాళ కేంద్ర…
Read More