పెరిగిన ఆర్టీసీ బస్సు టిక్కెట్లు | Increased RTC bus tickets | Eeroju news

హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో మరో సారి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్‌ చార్జీల్లో టోల్‌ గేట్‌ రుసుములు పెరిగాయి. టోల్‌ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 చొప్పున చార్జీలు పెరిగాయి. టోల్ గేట్లు ఉన్న రహదారుల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కూడా టోల్‌ రుసుములు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంతో టోల్‌ గేట్‌ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్‌ చార్జీల్లో కలిసి ఉన్న టోల్‌ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు,…

Read More