పింఛన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ అమరావతి AP CM Chandrababu’s open letter to pensioners ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది.…
Read More