పాలన… ప్రక్షాళన… | Reign… Purge… | Eeroju news

తిరుమల, జూన్ 15, (న్యూస్ పల్స్) పాలన మొదలైంది.. ప్రక్షాళన షురూ అయ్యింది. అది కూడా కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధానమైన తిరుమల నుంచి నాలుగోసారి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకోగానే ఆయన ఆ ఏడుకొండవాడిని దర్శించుకున్నారు. భక్తి భావం అలా ముగియగానే.. ఆయనలోని పాలకుడు నిద్రలేచాడు. ఐదేళ్లలో ఏదీ సరిగా జరగలేదు. అన్నింటిలో అరాచకం.. అవినీతి.. ఏదీ సక్రమంగా లేదు.. పాలకుడు తరహాలో అధికారులు కూడా తయారయ్యారు. ఇక మారాలి.. ప్రక్షాళన జరగాలి. ఇక ముందు కూడా ఇలానే ముందుకు సాగుతుందంటే ఇక నడవదు. ఏపీ నయా సీఎం చంద్రబాబు నాయుడు థాట్స్ ఇలా ఉన్నాయి. అందుకే ఆ తిరుమలేశుడి దర్శనం ముగియగానే ఫస్ట్ ఫోకస్ తిరుమల తిరుపతి దేవస్థానంపైనే పెట్టారు.నిజానికి వైసీపీ పాలనలో తిరుమల కొండపై అనేక అంశాలు వివాదస్పదమయ్యాయి. అన్యమత ప్రచారం కావొచ్చు..…

Read More