హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో పరిపాలన ఇంకా గాడిన పడలేదు. ప్రభుత్వం ఇంకా కిందా మీదా పడుతోంది. ప్రతీ విషయంలోనూ వివాదాస్పదమవుతోంది. మద్యం బ్రాండ్ల విషయంలో ఏం జరిగిందో అంతా గందరగోళంగా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాతే పాఠ్యపుస్తకాలు ప్రింటింగ్ చేసినా.. అందులో సీఎం కేసీఆర్ అంటూ పేజీలు ముద్రించారు. అవి పంపిణీకి వచ్చే వరకూ ఎవరూ గుర్తించలేదు. మరో వైపు గత ప్రభుత్వంలో అవినీతి పై జరుగుతున్న విచారణల్లో ఒకరు ముందు.. మరొకరు వెనక్కి లాగుతున్నారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పూర్తి పట్టు లేదన్న అభిప్రాయం కలుగుతుంది. అదే నిజమని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటే ఓ వ్యక్తి కాదు. వ్యవస్థ. మొత్తం…
Read More