నియోజకవర్గాలకు దూరంగా మాజీలు మహబూబ్ నగర్, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Mahbub Nagar పదేండ్ల పాటు అధికారంలో ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారే తప్ప.. నియోజకవర్గ కేంద్రాలలో ఉండడం లేదు. దీంతో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. గులాబీ పార్టీని నమ్ముకుని కొనసాగడమా.. లేదా పార్టీ మారడమా అన్న ఆలోచనలలో క్యాడర్ తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేనాటికి క్యాడర్ లో పెద్ద ఎత్తున మార్పులు జరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్థానాల పునర్విభజన, మహిళ రిజర్వేషన్ అమలు ప్రక్రియలు ఒకింత భయపెడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏ మండలాలు.. ఏ నియోజకవర్గంలో చేరుతాయో.. తమ సొంత మండలం తాను…
Read More