నిద్రలో విద్యశాఖ అధికారులు | Education officials in sleep | Eeroju news

వరంగల్, జూన్ 14, (న్యూస్ పల్స్) విద్యా శాఖలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినా, అధికారులు మాత్రం పాత ప్రభుత్వమనే భ్రమల్లోనే ఉన్నారు. మొద్దు నిద్ర వీడడంలేదు. దాని ఫలితమే తెలంగాణలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగింది?తెలంగాణలో  ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబిత ఇంద్రారెడ్డి పేర్లు యధాతధంగా ఉంచేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనికి బాధ్యులు ఎవరన్నదానిపై విచారణ మొదలైంది.పాఠ్య పుస్తకాలను కనీసం చూడకుండా పంపిణీ చేయడంపై విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటింది.…

Read More