నెలాఖరుకు రుణమాఫీ పూర్తయ్యేనా.. నిజామాబాద్, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) loan waiver తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది. ఈ ప్రక్రియలో ఇప్పటికే రైతులకు రుణమాఫీ కాగా…పలు సాంకేతిక కారణాలతో పలువురికి రుణమాఫీ నిలిచిపోయింది. రుణమాఫీ కాని వారి సమస్యలు పరిష్కరించి…అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేలా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు సాంకేతిక అడ్డంకులు తొలగించే పనిలో ఉన్నారు. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రులు అంటున్నారు.రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నాటికి రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్న, అర్హులైన వారందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. నవంబర్ 1 నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలున్న…
Read MoreTag: నిజామాబాద్
Farmers | రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్ | Eeroju news
రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్ నిజామాబాద్, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Farmers రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయిచ్చింది. వానాకాలం వ్యవసాయ సీజన్ ముగిసిపోయింది. అంటే సాగు భూముల్లో పంటల సాగు ముగిసింది. కానీ, ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన పంటల పెట్టుబడి సాయం రైతు భరోసా అందనేలేదు. అసలు జిల్లాల వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నుంచి రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆదేశాలు అందలేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో 2014 లో తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ కు ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు సీజన్ల ( ఖరీఫ్, రబీ)కు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరును అందించింది. నిరాటంకంగా కొనసాగింది. 2023 చివరన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేప్పటి 10…
Read MoreHeavy provision for Rythu Maha Dharna | రైతు మహా ధర్నాకు భారీ బందోబస్తు | Eeroju news
రైతు మహా ధర్నాకు భారీ బందోబస్తు నిజామాబాద్ Heavy provision for Rythu Maha Dharna నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో నిర్వహేంచే మహాధర్నాకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు… ప్రధానంగా రైతులు వచ్చే ప్రాంతాలైన పోచంపాడ్ ఎక్స్ రోడ్డు ,కమ్మర్పల్లి, చెపూర్, గోవింద్ పెట్ అర్గుల్ ల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు ….రైతులందరికీ 2లక్షల లోపు ఏ షరతులు లేకుండా రుణ మాఫీ చేయలన్న ప్రధాన డిమాండ్ తో టీజీఓ రైతులు ధర్నా పిలుపు ఇచ్చారు. రైతులు ధర్నాలు చేసేందుకు పర్మిషన్ తీసుకుంటే 163 సెక్షన్ ఏర్పాటు చేసి 45 మంది కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పడం సిగ్గుచేటని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… అయినప్పటికీ రైతులు…
Read MoreUmm.. dogs in Nizamabad | నిజామాబాద్ లో అమ్మో…కుక్కలు | Eeroju news
నిజామాబాద్ లో అమ్మో…కుక్కలు నిజామాబాద్, జూలై 22 (న్యూస్ పల్స్) Umm.. dogs in Nizamabad ఒక్క జూన్ నెలలోనే 435 కేసులు.. ఈ నెలలో ఇప్పటివరకు 243.. గత ఆరు నెలలుగా 300కు పైగానే.. సగటున రోజుకు 10 మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కల దాడిలో గాయపడుతున్నారు. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆకలి మంటతో జనం మీద దాడి చేస్తున్నాయి. వాటి పునరుత్పత్తి సీజన్లో డాగ్బైట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వాటి పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో దగ్గరగా నడుచుకుంటూ వెళ్లేవారిని ఎటాక్ చేస్తున్నాయి. బండ్లపై వెళ్లే వారిని, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలను వదలట్లేదు. అసలు ఎటు నుంచి వచ్చి కుక్కలు దాడులు దాడి చేస్తున్నాయో తెలియక ప్రజలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. డాగ్ బైట్ కేసులు…
Read More