తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత తెలుసా..!! హైదరాబాద్ Bathukamma తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక బతుకమ్మ ఆడబిడ్డలంతా సంబురంగా జరుపుకొనే ఘనమైన వేడుక ఇది. ప్రకృతిని ఆరాధిస్తూ సాగే పూల పండుగ బతుకమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో మరెక్కడా కనిపించని, తెలంగాణకు మాత్రమే సొంతమైన వినూత్నమైన, అరుదైన పూలవేడుక బతుకమ్మ. పూలతో దేవుడిని కొలవడం కాదు.. పూలనే దేవుడిలా కొలిచే వేడుక ఇది. బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగుపరిచే అమ్మ అని అర్థం. తొమ్మిది రోజులు తెలంగాణ అంతటా ఒక జాతరలా సాగి చివరిరోజు సద్దుల బతుకమ్మగా మన వాకిట్లో బతుకుదెరువును ఆవిష్కరిస్తుంది. ఆటపాటలతో మనల్ని సేదతీరుస్తుంది. జీవన సంబురాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో మాత్రమే జరుపుకొనే పండుగ బతుకమ్మ. స్వరాష్టంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది నేడు ప్రపంచంలో తెలంగాణవారున్న…
Read More