రాహుల్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక తిరువనంతపురం, నవంబర్ 23, (న్యూస్ పల్స్) Priyanka Gandhi తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. కేరళ వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ నేత, సమీప అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేసి రికార్డు సృష్టించారు. రెండో స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత…
Read MoreTag: తిరువనంతపురం
Shashi Tharoor | దేశ రాజధాని మార్చాలంటూ కొత్త డిమాండ్ | Eeroju news
దేశ రాజధాని మార్చాలంటూ కొత్త డిమాండ్ తిరువనంతపురం, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Shashi Tharoor దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఇక్కడ విపరీతంగా కాలుష్యం నమోదవుతోంది. చుట్టుపక్కల పరిశ్రమలు.. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు తమ పంట వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల విపరీతంగా కాలుష్యం నమోదవుతున్నది. దీనికి చలి కూడా తోడు కావడంతో ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. వృద్ధులు, చిన్నారులు శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ వినూత్న డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. ” ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. గాలి పీల్చడానికి అనువుగా లేకుండా పోతుంది. చాలామంది శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన…
Read MoreWayanad By Elections | వయనాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్ | Eeroju news
వయనాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్ తిరువనంతపురం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Wayanad By Elections కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి నియోజకవర్గాల నుంచి పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నారు. అయితే, బీజేపీ అధిష్టానం ప్రియాంక గాంధీపై పోటీకి నవ్య హరిదాస్ (39)ను బరిలోకి దింపేందుకు…
Read More