ఖమ్మం జిల్లా డెంగ్యూ విజృంభణ ఖమ్మం, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) Dengue fever ఖమ్మం జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. డెంగీ వ్యాప్తితో రాష్ట్రంలోని ఐదు జిల్లాలు హైరిస్క్ జోన్లో ఉన్నట్లు గుర్తించగా.. జాబితాలో ఖమ్మం జిల్లా పేరు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉన్నతాధికారుల సూచనలతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జ్వరాలు జనాన్ని మంచాన పడేస్తున్నాయి. కాగా డెంగీ కేసుల నమోదు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో నివాస ప్రాంతాలు మురుగు నీరుతో నిండిపోయాయి. దీంతో దోమల వ్యాప్తి బాగా పెరిగిపోయింది. ఈ ఫలితంగానే ప్రజలు డెంగీ బారిన పడుతున్నారుజ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య…
Read More