సోషల్ మీడియాలో ఈవీఎం ప్రొడక్షన్స్…. తెరపైకి కొత్త వాదనలు నెల్లూరు, జూలై 26, (న్యూస్ పల్స్) EVM productions on social media ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈవీఎంల పనితీరు, వాటిని హ్యాకింగ్ చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చన్న బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఈవీఎంలను నిషేధించాయి. బ్యాలెట్ రూపంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మనదేశంలో కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయి. కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడానికి ఈవీఎంల హ్యాకింగ్ కారణమని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 175 స్థానాలకు గాను 164 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం ఒంటరిగా 135 స్థానాలు విజయం సాధించింది. 21 చోట్ల జనసేన, 8 చోట్ల బిజెపి…
Read More