న్యూఢిల్లీ, జూన్ 15, (న్యూస్ పల్స్) హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జులై 22న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కాకుండా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కసరత్తులో భాగంగా నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ‘ఓటాన్ అకౌంట్’ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇది ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఎన్నికల తర్వాత…
Read More