ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా… హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Hyderabad కబ్జాలకు గురైన చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వివిధ ప్రభుత్వం సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లను పరిశీలించారు. అందులోని చెరువులు, నాలాల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై సమీక్షించారు. గొలుసు కట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మహానగరంలో అసలు ఎన్ని చెరువులుండేవి?. ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే లెక్కలు తేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చెరువులను గుర్తించేందుకు సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో హైడ్రా అధికారులు సమీక్ష చేపట్టారు. సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం హైడ్రా…
Read More