ఘనంగా నాగుల చవితి వేడుకలు హైదరాబాద్, విజయవాడ, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Nagula Chaviti కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలను చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది. కనుక చెట్టును, పుట్టను, రాయిని, నదులను, పశు పక్ష్యాదుల సహా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావించి పూజిస్తారు. అందులో భాగంగానే నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. నాగుల చవితికి పుట్టకు నూలు చుట్టి పూజ లు చేస్తారు. పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా నాగు పాము పుట్టల వద్ద స్థానిక దేవాలయాల వద్ద సుబ్రహ్మణ్య స్వామీ ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. పలు శ్రీ వల్లీ దేవసేనా సమేత…
Read More