గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం హైదరాబాద్, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్) తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తయ్యే క్రమంలో.. నూతన శకానికి నాంది పలికింది. ఏకంగా గూగుల్ సంస్థతో ఒప్పందాన్ని ఏర్పరచుకొని, హైదరాబాద్ నగరం వైపు ప్రపంచం చూసేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం గూగుల్ సీఐఓ రాయల్ హాన్సెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేసే పలు సంస్థల గురించి వారిద్దరి మధ్య చర్చలు సాగాయి. దీనితో తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్ సిద్దమైంది. భారతదేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను స్థాపించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ సీఐఓ కలిశారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత ఏర్పాటు చేసే సేఫ్టీ…
Read More