కొత్త మద్యం పాలసీ… విజయవాడ, ఆగస్టు 13 (న్యూస్ పల్స్) New Liquor Policy ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం పాడాలనే నిర్ణయానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ దుకాణాలనను అక్టోబర్ నుంచి వచ్చే కొత్త మద్యం పాలసీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఏపీలో గత ఐదేళ్లుగా రకరకాల బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించినా జనం మరో దారి లేక వాటినే కొనుగోలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు రెట్లు ధరలు పెంచిన ప్రభుత్వం మద్యం తయారీదారుల్ని తన దారిలోకి తెచ్చుకోడానికి రకరకాల అస్త్రాలు ప్రయోగించింది. ఈ క్రమంలో మద్యం మీద కళ్లు చెదిరే ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చింది. మద్యం డిస్టిలరీలు, అమ్మకాలు, నగదు చెల్లింపులు మాత్రమే చేసినా ప్రభుత్వానికి ఏటా రూ.36వేల కోట్ల ఆదాయం వచ్చింది.…
Read More