కొత్త జిల్లాలపై రాని గెజిట్ నోట్ ఒంగోలు, జూన్ 26, (న్యూస్ పల్స్) Gazetted Note on New Districts ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తై రెండేళ్లు దాటుతున్న రాష్ట్రపతి అమోద ముద్ర మాత్రం లభించలేదు. రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజక వర్గాల ప్రతిపాదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. స్థానికుల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కారణాలతో ఏక పక్షంగా జిల్లాల సరిహద్దులు నిర్ణయించేశారు.కేవలం అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికే అప్పట్లో ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన విజయ్‌కుమార్ జిల్లాల పునర్విభజన చేశారనే ఆరోపణలు ఉన్నాయి.తాజాగా ఈసెట్ అడ్మిషన్ల నేపథ్యంలో కందుకూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని ఐదు మండలాలు విశాఖపట్నం ఏయూ పరిధిలోనే ఉంటాయని ఈసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఏపీలో జిల్లాల పునర్విభజనకు ఇప్పటికీ రాష్ట్రపతి అమోద ముద్ర లభించకపోవడంతో…
Read More