కేరళలో నిఫా వైరస్ తిరువనంతపురం, జూలై 22, (న్యూస్ పల్స్) Nipha virus in Kerala కేరళలో మరోసారి నిఫా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రమత్తం కాగా కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఇప్పటికే ఓ 14 ఏళ్ల బాలుడు నిఫా సోకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు తీసిన ఈ వైరస్ శాంపిల్‌ని పుణేలోని కి పంపించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వానికి కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయో మరోసారి పరిశీలించాలని తెలిపింది. బాధితుల కుటుంబ సభ్యులనూ టెస్ట్ చేయాలని సూచించింది. ఆ పరిసర ప్రాంతాలపైనా నిఘా పెట్టాలని వెల్లడించింది. వీలైనంత వరకూ టెస్ట్‌లు పెంచాలని తెలిపింది. బాధితులున్న పరిసరాల్లో కేసులు నమోదయ్యే అవకాశముండొచ్చని…
Read More