గులాబీ నేతల్లో మౌనం… హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Silence among the pink leaders పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న భారత రాష్ట్ర సమితికి ఫిరాయింపుల భయం పట్టుకుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. త్వరలో లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ సవాల్ చేస్తోంది. ఇంకోవైపు పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ కేసుల ఉచ్చు బిగిసుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంకా బెయిల్ రాక జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రత్యర్థిగా ఉంది. దీంతో ఈ రానున్న రోజులు మరింత పార్టీకి గడ్డుకాలంగా కనిపిస్తుందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇన్ని పరిణామాల మధ్య పార్టీ కీలక నేతలు కేటీ రామారావు, హరీష్ రావు…
Read More