కేటీఆర్ వర్సెస్ సీతక్క హైదరాబాద్, జూలై 31 KTR vs. Sitakka తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందుకోసం బుధవారం కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ప్రస్తుతం ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ మొదలైంది. మొదట బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ చర్చను ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో తెలంగాణ చీకట్లో నిండిపోతుందని సరిగ్గా పదేళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా అని ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది అన్నారని గుర్తు చేశారు. అలాగే ఈ పదేళ్లల్లో రాష్ట్ర సంపద పెరిగిందని గతంలో భట్టి విక్రమార్క చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట…
Read More