కేంద్ర నిధులతో మూడు జిల్లాలకు రోడ్లు కడప, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Roads ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడం రాజకీయ దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయడం వెనుక మతలబు ఏమిటని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాయంపై బిల్డర్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. కోవిడ్ తర్వాత రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి కొత్త ప్రాజెక్టులకు 50ఏళ్ల నిడివితో నాలుగు శాతం వడ్డీలకు కేంద్రం అప్పులు ిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘ప్రత్యేక సహాయం’ కేటగిరీ లో ప్రభుత్వం నుండి మంజూరైన ప్రాజెక్టులకు ఇటీవల బిల్లులు చెల్లించారు. ఈ పథకంలో కేంద్రం నుంచి సహాయాన్ని…
Read More