కాళేశ్వరం విచారణకు కేసీఆర్ రావాల్సిందేనా కరీంనగర్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) KCR కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ హీట్ క్రియేట్ చేస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్‌విచారణను స్పీడప్ చేసింది.ఆరోపణలు, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను విచారించింది కమిషన్. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్‌కు రాబోతుందట. వచ్చే నెల 5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్..మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేసిన హరీశ్ రావును కూడా విచారణకు పిలుస్తారని టాక్…
Read More