అమరావతి రైతుల కోసం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి నిర్మాణం కోసం చాలామంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇది శుభ పరిణామమని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లారపు నవీన్ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు శుభవార్త చెప్పారు. వారికి కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నవీన్ వెల్లడించారు.తాజాగా.. గవర్నర్‌పేటలోని సీఆర్డీఏ కార్యాలయంలో గతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందుకోని రైతులకు.. లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందుకున్న రైతులు వారం లోపు సంబంధిత కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లాటరీకి…
Read More