ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు విజయవాడ, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) CM Chandrababu రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా…తరువాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని…కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.…
Read More