ఎన్డీయే వారియర్ గా పవన్ హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Pawan Kalyan బీజెపి నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి బిజెపి సొంతంగా అధికారంలోకి వస్తుందని భావించింది. 300 పార్లమెంట్ స్థానాలపై గురి పెట్టింది. మిత్రులతో కలిసి 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. కానీ 240 సీట్లు వద్ద బిజెపి బలం ఆగిపోయింది. మిత్రుల అవసరం ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో టిడిపి 16, నితీష్ నేతృత్వంలోని జెడియు 12 స్థానాలతో ఆదుకున్నారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చామన్న సంతోషం కంటే.. బలం తగ్గిందన్న బాధ బిజెపి పెద్దలను వెంటాడింది. అదే సమయంలో మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఓటమి తప్పదని సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రెండు రాష్ట్రాల్లో విజయం…
Read More