ఆరు కొత్త విమానశ్రయాలకు కసరత్తు… విజయవాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Airports ఏపీలో కొత్త విమానాశ్రయాలకు కసరత్తు జరుగుతోంది. ఆరు కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం సర్వే చేయనుంది. ఈ కొత్త ఎయిర్‌పోర్టులకు సంబందించిన ప్రతిపాదనలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పంపింది.ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సర్వే చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈ అధ్యయనం తొమ్మిది అంశాలపై చేస్తారు. శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమగోదావరి, ప్రకాశం, చిత్తూరు, పల్నాడు మొత్తం ఆరు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.శ్రీకాకుళం జిల్లాలో 1,383 ఎకరాలు, కాకినాడ జిల్లాలోని తుని-అన్నవరంలో 787 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలులో 657 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో…
Read More