ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు విశాఖపట్టణం, డిసెంబర్ 10, (న్యూస్ పల్స్) ఈ ఏడాది మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టి విశాఖపట్నం పోర్టులో 25 టన్నుల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఉన్న కంటైనర్‌ని స్వాధీనం చేసుకుంది.డ్రైడ్ ఈస్టులో డ్రగ్స్ సబ్‌స్టాన్స్ ఉన్నట్లు అనుమానం ఉందని, అందుకే ఈ కంటైనర్‌ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు అప్పుడు సీబీఐ పేర్కొంది.ఎనిమిది నెలల తర్వాత.. అంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ కంటైనర్‌లో ఉన్నది కేవలం ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మాత్రమేనని, డ్రగ్స్ కాదని విశాఖ కోర్టు (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కోర్టు)కు సీబీఐ రిపోర్టు అందించింది.దీని ఆధారంగా ఆ కంటైనర్‌ను విడుదల చేసినట్లు విశాఖపట్నం కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ చెప్పారు.ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో…
Read More