ఆదాయం పెంచుకొనేది ఎలా విజయవాడ, జూలై 23 (న్యూస్ పల్స్) How to increase income ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం గత కొన్నేళ్ళుగా తగ్గిపోతోంది. 2014-19 మధ్య అంతంత మాత్రంగా ఉన్న ఆదాయం ఆ తర్వాత గణనీయంగా పడిపోయింది. ఇందులో విధానపరమైన లోపాలతో పాటు పన్ను ఎగవేతలు యథేచ్ఛగా సాగడమే దీనికి ప్రధాన కారణం. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు చెల్లించే పన్నులు, ప్రభుత్వానికి జమ చేసే పన్నుల్లో వ్యత్యాసం పెరిగిపోయింది. కొన్నేళ్ళ క్రితం ఓ ఉద్యోగ సంఘంతో ప్రభుత్వానికి ఘర్షణ వైఖరి ఏర్పడటానికి కారణం కూడా ఇదేననే ప్రచారం ఉంది. పన్నుల వసూళ్లను నేరుగా పర్యవేక్షించే శాఖల్లో కొందరి చేతివాటంతో ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జిఎస్టీ వసూళ్లలో ప్రభుత్వానికి- పన్ను చెల్లింపు దారులకు మధ్య వ్యాపారులు…
Read More