అలోవెరా (కలబంద ) యొక్క ప్రయోజనాలు Benefits of Aloe Vera ASVI Health కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని చాలా బ్యూటీ కేర్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఈ జ్యూస్లో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కలబందలోని పోషకాలు జుట్టును దృఢంగా ఉంచుతాయి. అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. చుండ్రు ఈ కలబంద రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు పోతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదల బాగుంటుంది. కలబందలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉన్నందున చుండ్రుకు సహజ నివారణ. దీన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు తగ్గుతుంది. ఎంజైమ్లు కలబందలో ఉండే ఎంజైమ్లు జుట్టును లోపలి నుండి పోషించడంలో సహాయపడతాయి. దీంతో జుట్టు సిల్కీగా, మెరుస్తూ ఉంటుంది.…
Read More