అమరావతిలో లగ్జరీ విల్లాలకు డిమాండ్ గుంటూరు, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Amaravati ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఫోకస్ పెట్టడంతో.. భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఎక్కువ మంది లగ్జరీ విల్లాలపై పెట్టుబడి పెడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం.. అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభం కావడమేనని చెబుతున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయి. ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగలేదు. కానీ.. గిడిచిన రెండు నెలలుగా భూ క్రయవిక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో భూమి లేని వారు కొత్తగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఏపీ నుంచే కాకుండా…
Read More