అమరావతిలో కనిపించని రియల్ బూమ్ విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Amaravati ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ రంగానికి కూటమి ప్రభుత్వంలో కూడా ఒడిదుడుకులు తప్పడం లేదు. రాజధాని నిర్మాణంపై జరిగిన రాద్ధాంతం ఏపీ రియల్ ఎస్టేట్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచినా ఇంకా మార్కెట్‌పై నమ్మకం రావట్లేదు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందోననే ఆందోళన నిర్మాణ రంగాన్ని వేధిస్తోంది.ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ రంగం 2020 నుంచి తీవ్ర సంక్షోభాన్ని చవి చూస్తోంది. 2019లో ఇసుక తవ్వకాలపై నిషేధంతో మొదలైన ప్రతిష్టంభన మూడు రాజధానుల ప్రకటన తర్వాత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. క్రమబద్దమైన అభివృద్ధి, స్థలాల కొరత కారణంగా చిన్న పట్టణాలు మొదలుకుని, పది లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాలు, పదిలక్షల జనాభాకు పైబడిన…
Read More