అమరావతిపై మాస్టర్ ప్లాన్ రెడీ విజయవాడ, జూన్ 22, (న్యూస్ పల్స్) A master plan is ready for Amaravati : ఒక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో రాజధాని అనేది కీలకం. కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని అన్నది లేకుండా పోయింది. రాజకీయ స్వార్థానికి మొగ్గ దశలో ఉన్న అమరావతి సమిధగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి అమరావతిని చిదిమేసింది. రాజధాని నిర్మాణాలను పాడుబెట్టింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల చెర వీడిన అమరావతి రాబోయే ఐదేళ్లలో ప్రజా రాజధానిగా అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కీలకమైన నిర్మాణాలను పునః ప్రారంభించాల్సి ఉంటుంది. * ఐకానిక్ టవర్స్ : అమరావతిలో ఐకానిక్ టవర్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. ఇప్పటికే చాలా వాటి నిర్మాణం పూర్తయింది.…
Read More