అమరావతిపై అందరి కళ్లు… విజయవాడ, జూన్ 27, (న్యూస్ పల్స్) All eyes on Amaravati హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టేందుకు సైబరాబాద్‌కు తానే అంకురార్పణ చేశానని.. అభివృద్ధిని చేశానని చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు తనకు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చారని .. దాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పేవారు. అందుకే సెక్రటేరియట్, అసెంబ్లీ, ఉద్యోగుల క్వార్టర్స్, రాజ్ భవన్ వంటివి కట్టి అదే రాజధాని అనిపించుకునే అవకాశం ఉన్నా.. రాజధానిని ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా మార్చాలన్న పట్టుదలతో అమరావతికి రూపకల్పన చేశారు. చంద్రబాబు ఈ సిటీ కోసం అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరిపి పక్కా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టాలి.. ఎలా నిధుల సమీకరణ చేయాలన్న అంశాలపై ఓ బ్లూ ప్రింట్ రెడీ…
Read More